విరాధుడు ఎవరు అతనికి శాపవిమోచనం ఎలా కలిగింది.

రామ లక్ష్మణులు మరియు సీత అరణ్యవాసంలో బాగంగా ప్రయాణం చేస్తూ వుండగా హటాత్తుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడు చూడడానికి పెద్ద బండ రాయి లా వున్నాడు.రామ లక్ష్మణులు వాడిని చూసి నరమాంసబక్షకుడని గ్రహించారు. ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూసాడు. వారిని చంపడానికి వారి దగ్గరకి వచ్చాడు. ఆప్పుడు వాడి కళ్ళకి అందమైన సీత కన్పించింది.వాడు సీతని తీసుకొని పక్కకి వెళ్ళాడు. తర్వాత రామ లక్ష్మణునితో ఇలా అన్నాడు. “మీరు ఎవరు ? ఇక్కడికి ఏలా వచ్చారు? చూడడానికి మునివేశాలలో ఉన్నారు. మీ వెంట ఈ స్రీ ఎందుకు ఉంది. ఈమెతో మీకు ఏమిటి సంబంధం?మునులు సన్యాసులు కదా . మరి ముని దర్మం తప్పి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు” అని ఆ రాక్షసుడు అన్నాడు.

ఆ మాటలకి సమాధానంగా రాముడు ఇలా అన్నాడు. “మమ్మల్ని ఇలా అడుగుతున్నవే ఇంతకి నీవెవరు ” అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు నా పేరు విధానుడు. నేను ఒక రాక్షసుడిని ఇక్కడి మునులే నాకు ఆహరం. ఈ రోజుకి మీరే నాకు ఆహరం అని అన్నాడు .అలాగే ఈ స్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను అని ఆ రాక్షసుడు అన్నాడు. అప్పుడు సీతమ్మ భయంతో వణికిపొయింది. సీత ని చూసి రామునికి భాద కలిగింది.

అప్పుడు రాముడు విరాధుని తో ఇలా అన్నాడు.” ఓ రాక్షసా మేము మునులము కాదు. నా పేరు రాముడు. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మా కర్తవ్య నిర్వహణ కోసం ఇక్కడకొచ్చాము.నీవు ఎవరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావని అడిగాడు “. ఆ మాటలను విన్న రాక్షసుడు రామునితో నేను బ్రహ్మ దేవుని దగ్గరనుండి ఎవరి చేత చావకుండా వరాన్ని పొందాను.నాకు ఈమె మీద మొహం కలిగింది మీరు ఈమెను ఇక్కడే విడిచిపెట్టి నా నుండి మీ ప్రాణాలను కాపాడుకోండి అని అన్నాడు.

అప్పుడు రామునికి చాల కోపం కలిగింది. వెంటనే రాముడు రాక్షసుని మీదకి బాణాలని వదిలాడు. రాక్షసుని మీదకి వదిలిన బాణాలు వర్షం లా పడ్డాయి. రాక్షసుని శరీరం మొత్తం బాణాలతో నిండిపోయింది. ఆ రాక్షసుడు ఒక్కసారి ఒళ్ళు విరవగానే బాణాలన్నీ కింద పడ్డాయి. ఆ సమయంలో సీత ని రాక్షసుడు వదిలేసాడు. బ్రహ్మ వరం కారణంగా బాణాలు రాక్షసుడిని ఏమీ చేయలేకపోయాయి.వెంటనే రాక్షసుడు రామ లక్ష్మణుల మీదకు ఆయుధంతో విరుచుకు పడ్డాడు. అప్పుడు రామ లక్ష్మణులు రాక్షసుని రెండు చేతులు విరిచేసారు. రాక్షసుడు ఆ బాధ భరించలేక కింద పడి ముడ్చపోయాడు. కింద పడిన విరాధుని రామ లక్ష్మణులు కత్తులతో చీల్చారు. ఏమి చేసిన బ్రహ్మ వరం కారణంగా విరాధుని ప్రాణం పోలేదు. రామ లక్ష్మణులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు.

అప్పుడు రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.” లక్ష్మణా! ఈ రాక్షసుడు బ్రహ్మ దేవుని వరం వల్ల మనం ఎంత గాయం చేసినను చావడం లేదు కావున మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము”అనెను. వెంటనే మూర్చ నుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలను విన్నాడు.అప్పుడు రామునితో విరాధుడు ఇలా అన్నాడు”ఓ రామ మీరెవరో నేను గుర్తించాను.మీరు మహా పరాక్రమవంతులు. మీతో తలపడి నేనెప్పుడో మరణించాను.మళ్ళి చంపడం ఎందుకు. నేను తుoబురుడను అనే గంధర్వుడను. రంభ యొక్క వ్యామోహం వలన నేను కుబేరుని సేవకు వెళ్ళలేదు.కుబేరుని శాపం వలన నాకు ఈ శాపం వచ్చింది. దశరధుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను చంపుతాడో అప్పుడు నీ రూపం నీకు వొస్తుందని కుబేరుడు శాపవిమోచనం తెలిపెను “. కావున మీరు నాకు అనుజ్ఞ ఇవ్వమని ప్రార్థించాడు. రామ లక్ష్మణులు విరాధుని మాటలు మన్నించారు.

విరాధుడు రామునితో.. రామా మరణించిన రాక్షసులని గొయ్యి తీసి పూడ్చడం వల్ల మాకు పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. కావున నన్ను ఆ విధంగా పుడ్చమని కోరెను. వెంటనే విరాధుడు మరణించెను. లక్ష్మణుడు మరణించిన ఆ దేహాన్ని గొయ్యిలో పడేసాడు. అలా రాముని ద్వారా విరాధునికి శాప విముక్తి కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *