దక్షయజ్ఞం సమయం లో ధధీచి మహర్షి ఏమన్నారో తెలుసా?

దేవతలారా! మహర్షులారా! ఈ యజ్ఞానికి పరమశివుడు రాలేదు. దీనికి కారణం ఏమిటి?. మహర్షులు, లోకపాలురు ఇక్కడికి వచ్చిన కూడా పరమశివుడు లేని ఇ యజ్ఞం అంత శోభాయమానంగా కనపడటంలేదు. పరమశివుని కృప వల్ల సమస్త మంగళ కార్యాలు చక్కగా నెరవేరుతాయి. అలాంటి శంకరుడు ఇక్కడ ఎందుకు కనపడటం లేదు.?

దాక్షా! ఆ స్వామిని తలుచుకున్న లేదా దయతో ఆయన చూసిన అమంగళము కూడా మంగళం అవుతుంది. వారు ఈ యజ్ఞముకు వీచ్చేయుట చాల అవసరం. కావున నీవు పరమేశ్వరుని ఇచ్చటకు త్వరగా పిలిపించుము. మహేశ్వరుడు ఉన్నచోటకు వెళ్ళండి అక్కడ నుండి సతీదేవితో కూడిన శంకరురు త్వరగా ఇక్కడికి ఆహ్వానించండి.

దధీచి మాటలను విన్న దక్షుడు నవ్వుతు ఇలా అన్నాడు: విష్ణుభగవానుడు సకల దేవతలకు మూలం. నేను ఆ స్వామిని సాదరముగా ఆహ్వానించాను. ఇప్పుడు యజ్ఞముకు ఎలాంటి లోపం ఉన్నది. బ్రహ్మదేవుడు వేదములతో, ఉపనిశాతులతో ఇచటకు వచ్చారు. అలాగే దేవగనములతో కూడిన దేవేంద్రుడు ఇక్కడే ఉన్నారు. మీవంటి మహర్షులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కావున మనకు ఇక్కడ రుద్రునితో పని ఏమి ఉన్నది.అతనికి తల్లిగాని, తండ్రిగాని లేరు. అతను భూతప్రేత పిశాచాలకి అధిపతి. మూర్కుడు, జడుడు. ఈ యజ్ఞాముకు ఆహ్వనించుటకు యోగ్యుడు కాదు.

ధక్షుని మాటలను విన్న దధీచి మహర్షి ఇలా అన్నారు: భగవంతుడు శివుడు లేకుండా ఇ యజ్ఞము యజ్ఞము కాజాలదు. ఇలా చేసినచో అది నీ పతనానికి నాంది అవుతుంది. దధీచి మహర్షి వెంటనే యజ్ఞశాల నుండి బయటికి వెళ్ళిపోయారు. శివ భక్తులు అలాగే ఆ స్వామిని సమర్ధించువారు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *