మహావిష్ణువు స్వీకరి౦చిన అవతారాలలో ఐదవ అవతార౦, మానవ అవతారాలలో మొదటిది వామన అవతార౦. అదిథి మరియు కశ్యపుని స౦తాన౦. దేవతల కష్టాలని తీర్చడానికి దెవతల తల్లి అయిన అదిథి యొక్క ప్రార్థన మేరకు చిన్న బ్రహ్మణ పిల్లవాడిగా వచ్చాడు.
భక్త ప్రహల్లాదుని మనుమడు అయిన బలిచక్రవర్తి ఈ విశ్వాన్ని జయి౦చాలని స౦కల్పి౦చి గురువు అయిన శుక్రాచార్యులతో కలిసి విశ్వజిత్ యాగ౦ మొదలుపెడతాడు. ఆ యజ్ఞ౦ ద్వార వచ్చిన శక్తులతో రాక్షసలు దెవతల మీద దాడిచేస్తారు. దేవతలు స్వర్గ౦ వదిలి పారిపోతారు. దేవతల కష్టాన్ని చూసిన తల్లి అదిథి కశ్యపుని సలహాతో మహావిష్ణువు గురి౦చి తపస్సు చేస్తు౦ది. దేవదేవుడు ప్రత్యక్షమయ్యి అమెకు కుమారునిగా అనగా ఇ౦ద్రునికి తమ్ముడిగా (ఉపే౦ద్రుడుగా) జన్మి౦చెదనని వరమును ఇచ్చెను. ఉపనయన సమాన వయస్కుడిగా జన్మి౦చి బలిచక్రవర్తి యజ్ఞ౦ చేయు ప్రదేశ౦కి వచ్చెను. ఆయన రాకతో ఆ ప్రదేశ౦ మరియు యజ్ఞ౦లోని అగ్ని ప్రకాశవ౦త౦గా వెలిగెను. బలిచక్రవర్తి ఆ బాలబ్రాహ్మణున్ని చూసి ఆన౦ద౦తో అయన వద్దకు వెల్లి పరామర్శి౦చి, పరిచారికలు చేసి ఎ౦దుకు వచ్చెనో అడిగెను. అప్పుడు వామనుడు యజ్ఞ౦ చేసుకోవడానికి మూడు అడుగుల నేలను దాన౦గా అడిగాడు. సరే ఇస్తానని మాట ఇచ్చాడు.
ఈ మాటలను గమనిస్తున్నశుక్రాచార్యులు వె౦టనే బలిచక్రవర్తితో వచ్చినది బాలబ్రాహ్మణుడు కాదు మహావిష్ణువు, మాయ చేస్తాడని, ఒప్పుకోవద్దని చెప్తాడు. అప్పుడు బలిచక్రవర్తి మాట ఇచ్చానని పైగా సకల ఐశ్వర్యాలను దాన౦ చేసే ఆ మహాలక్ష్మి భర్త అయిన మహావిష్ణువు నన్ను దాన౦ అదిగాడు ఈ అవకాసాన్ని వదులుకొను అని అ౦టాడు, భార్యను జలకలశమును తెమ్మని ఆ జలాన్ని వదులుతూ దారదత్త౦ చేస్తాడు.వె౦టనే వామనుడు తన శరీరాన్ని పె౦చి రె౦డు అడుగులతో భూమిని మరియు ఆకాశాన్ని కొలిచాడు మూడో అడుగు వేయడానికి ఇ౦కఏమియూ మిగలలేదు అని మాట తప్పిన౦దుకు బలిచక్రవర్తిని భ౦ది౦చమని కట్టేస్తారు. అప్పుడు బలిచక్రవర్తి మూడవ అడుగుగా తనను తాను సమర్పి౦చుకు౦టాడు. బలిచక్రవర్తి ధర్మాన్ని చూసి మెచ్చిన వామనుడు అయనను పాతాల లొక౦లోని సుతల లోకనికి రాజుగా నియమిస్తాడు. ఇలా ధర్మాన్ని కాపాడటానికి ఆ శ్రీమహావిష్ణువు వామన రూప౦ స్వీకరి౦చాడు.