భారతీయులు ఆరాధించే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వీరు సృష్టి,స్థితి,లయ కారకులు. స్థితి కారకుడైన విష్ణుపరమాత్ముడు నీల మేఘ శ్యామ వర్ణముతో చతుర్భుజాలతో శంక,చక్ర,గదా,అభయ హస్తాలను ధరించి ఉంటాడు. వైకుంఠం లో పాల సముద్రం నందు ఆదిశేషుని పైన పవలించి ఉంటాడు. గరుత్మంతుడు వాహనంగా కలవాడు. ఈయన మహాలక్ష్మి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాడు. ఈయన అన్యాయాన్ని, అధర్మాన్ని అణచడానికి వేదాలను,ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాలను స్వీకరించాడు. వాటిలో 10 అవతారాలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. వాటిని దశావతారాలు అంటారు. అవి
- మత్స్యావతారం
- కూర్మావతారం
- వరాహావతారం
- నరసింహావతారం
- వామనావతారం
- పరశురామ అవతారం
- రామావతారం
- బలరామ అవతారం
- కృష్ణావతారం
- కల్కి అవతారం.